ఇండియాలో వింతలకు కొదవ లేదు. రాజస్థాన్లోని దుంగార్పూర్ (D) గలందర్లో 70 ఏళ్లుగా సహజీవనం చేస్తున్న ఓ వృద్ధ జంట జీవిత చరమాంకంలో వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. రమాభాయి అంగారి(95), జీవాలి దేవి(90)కి పెళ్లి కాకపోయినా ఎనిమిది మంది పిల్లలు, మనవళ్లు ఉన్నారు. వారి సమక్షంలోనే తాజాగా పెళ్లి ముచ్చట తీర్చుకున్నారు. అయితే రాజస్థాన్లో పరస్పర అంగీకారంతో సహజీవనం చేసే ‘నత ప్రథ’ అనే సంప్రదాయం ఇప్పటికీ ఉంది.
70 ఏళ్లుగా సహజీవనం.. ఎట్టకేలకు పెళ్లి
07
Jun