సోషల్ మీడియా రీల్స్ పిచ్చి ప్రాణాలమీదకు తెస్తోంది. తాజాగా ఓ వ్యక్తి రీల్స్ చేసేందుకు నదిలోకి దిగి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్‌కు చెందిన వికాస్ హరిద్వార్‌లోని గోవింద్ ఘాట్ వద్ద స్నానం చేసేందుకు సేఫ్టీ గ్రిల్‌ను దాటేసి లోపలికి వెళ్లాడు. ఈత కొడుతుండగా వీడియో తీయించుకున్నాడు. నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో అందులోనే మునిగి చనిపోయాడు. *రీల్స్
కోసం ప్రాణాలకు తెగించకండి