TG: జగిత్యాల కోరుట్లలో ఐదేళ్ల చిన్నారి హితీక్ష హత్య కేసు ఊహించని మలుపు తిరిగింది. కుటుంబ తగాదాలతో హితీక్షను చిన్నమ్మే చంపినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. సీసీ ఫుటేజీ ఆధారంగా ఆమెను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. శనివారం పిల్లలతో ఆడుకునేందుకు వెళ్లిన చిన్నారి బాత్రూమ్లో శవమై తేలింది. నిన్న చిన్నారి అంత్యక్రియలు ముగిశాయి. కుటుంబసభ్యులు, స్థానికులు హితీక్షకు కన్నీటి వీడ్కోలు పలికారు.
గొంతుకోసి చిన్నారి హత్య.. చిన్నమ్మే హంతకురాలు
09
Jul