ఇచ్చోడ మండలం కోకస్ మన్నూర్ అటవీ ప్రాంతంలో ఉన్న పెద్దగుండం జలపాతం జలకళ సంతరించుకుంది. ఇచ్చోడ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో చుట్టూ గుట్టల మధ్య ఈ జలపాతం ఉంది. దాదాపుగా 30 అడుగుల ఎత్తు నుంచి నీరు ఎగిసి గుండంలోకి పడే సమయంలో వచ్చే శబ్దం మంత్రముగ్ధుల్ని చేస్తోంది. పరవళ్లు తొక్కుతూ పర్యాటక ప్రేమికులకు ఆహ్వానం పలుకుతోంది.
ఇచ్చోడ: మంత్రముగ్ధుల్ని చేస్తున్న పెద్దగుండం జలపాతం
09
Jul