కాసిపేట మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన రైతు రాజలింగు లేగదూడ పులి దాడిలో మరణించినట్లు బెల్లంపల్లి అటవీ క్షేత్రాధికారి పూర్ణచందర్ తెలిపారు. మండలంలో పెద్దపులి సంచరిస్తున్నందున సమీప గ్రామాల ప్రజలు ఒంటరిగా తిరగవద్దని సూచించారు. వ్యవసాయ పనుల నిమిత్తం గుంపులుగా వెళ్లాలని సూచించారు. ఎవరికైనా పెద్దపులి సంచారం తెలిస్తే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాలని కోరారు.
పొలంలో లేగదూడను చంపిన పులి
09
Jul