జమ్మూ కశ్మీర్ లో భారీ వర్షాల కారణంగా పలు మార్గాల్లో అమర్నాథ్ యాత్రను నిలిపివేసినట్లు అధికారులు ప్రకటించారు. ఉదయం నుంచి ఏకధాటిగా వానలు పడుతుండటంతో పహల్గామ్, బల్తాల్ మార్గాల్లో యాత్రను తాత్కాలికంగా రద్దు చేశారు. ఈ నెల 31న భగవతి నగర్ బేస్ క్యాంపు నుంచి ప్రారంభమయ్యే యాత్రను కూడా రద్దు చేశారు. కాగా ఇప్పటివరకు 3.93 లక్షల మందికి పైగా భక్తులు మంచు శివలింగాన్ని దర్శించుకున్నారు.
ఆ మార్గాల్లో అమర్ నాథ్ యాత్ర నిలిపివేత!
01
Aug