AP: కర్నూలు బస్సు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడ్డవారు వెంటనే కోలుకోవాలని ఆకాంక్షించారు. అటు మంత్రి లోకేశ్ ఈ దుర్ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ఇది గుండెలు పగిలే ఘటన అని, గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేశారు. మరోవైపు హోంమంత్రి అనిత ఘటనాస్థలానికి బయల్దేరారు. ఈ ప్రమాదంలో 20 మంది చనిపోయినట్లు సమాచారం.
కర్నూలు బస్సు ప్రమాదం.. రాష్ట్రపతి దిగ్భ్రాంతి
24
Oct