AP: మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ చీఫ్ జగన్ నేడు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరి పెనమలూరు సెంటర్, ఉయ్యూరు మీదుగా కృష్ణా జిల్లాలోని పెడన నియోజకవర్గం గూడూరుకు చేరుకుంటారు. ఆ ప్రాంతంలో తుఫాను వల్ల దెబ్బతిన్న పంటల్ని పరిశీలించి రైతుల్ని పరామర్శిస్తారు. తర్వాత అవనిగడ్డ హైవే మీదుగా తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు
కృష్ణా జిల్లాలో పర్యటించనున్న జగన్
04
Nov