AP: చెన్నై సెంట్రల్ – విజయవాడ మధ్య నడుస్తున్న వందేభారత్ రైలు(20677/20678)ను నరసాపురం వరకు పొడిగిస్తూ రైల్వే బోర్డు ఉత్తర్వులిచ్చింది. ప్రస్తుతం ఈ రైలు 5.30AMకు చెన్నైలో బయలుదేరి రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, తెనాలి మీదుగా విజయవాడకు చేరుతోంది. ఇకపై అక్కడి నుంచి గుడివాడ, భీమవరం మీదుగా నరసాపురానికి 2.10PMకు చేరుకుంటుంది. తిరిగి అక్కడ 2.50PMకు బయలుదేరి 11.45PMకు చెన్నైకి చేరుతుంది.
నరసాపురం వరకు వందేభారత్ రైలు
09
Nov