ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అరుదైన ఘనత సాధించింది. ఇవాళ SBI షేర్లు రాణించడంతో బ్యాంక్ మార్కెట్ విలువ రూ.8 లక్షల కోట్లు దాటింది. దీంతో ఈ ఘనత అందుకున్న తొలి ప్రభుత్వ రంగ సంస్థగా నిలిచింది. ఇవాళ SBI షేర్ 9.48 శాతం పెరిగింది. గత ఏడాది ఈ షేర్ విలువ 40 శాతం పెరగడం గమనార్హం. ఎన్డీఏకు సానుకూలంగా ఫలితాలు వస్తాయనే ఎగ్జిట్ పోల్స్ అంచనాతో ఇవాళ స్టాక్ మార్కెట్ లాభాల బాటలో దూసుకెళ్లింది.
SBI అరుదైన ఘనత
04
Jun