TG: భార్య మరణాన్ని తట్టుకోలేని చొప్పదండి కాంగ్రెస్ MLA మేడిపల్లి సత్యం తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తన ఇద్దరు పిల్లలను పట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చారు. సత్యం, ఆయన పిల్లల ఆవేదన చూసి అక్కడున్న వారు సైతం కంటతడి పెట్టుకున్నారు. కాంగ్రెస్ నేత మైనంపల్లి హన్మంతరావు ఆయనను ఓదార్చారు. నిన్న సత్యం భార్య రూపాదేవి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కడుపునొప్పి భరించలేకే ఆమె సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
పిల్లల్ని పట్టుకుని బోరున విలపించిన ఎమ్మెల్యే సత్యం
22
Jun