AP: కువైట్లో అష్టకష్టాలు పడుతున్నానంటూ వీడియో పంపిన శివ ప్రస్తుతం క్షేమంగా ఉన్నట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు. అతడు ప్రస్తుతం కువైట్లోని ఇండియన్ ఎంబసీలో ఉన్నారని, కేంద్రప్రభుత్వ సాయంతో త్వరలోనే ఏపీకి తీసుకొస్తామని ట్వీట్ చేశారు. కాగా, తనను ఎవరైనా కాపాడకుంటే చావే శరణ్యమని శివ వీడియో పోస్టు చేశారు. దీన్ని WAY2NEWSలో చూసిన లోకేశ్ శివకు సాయం చేయాలని టీడీపీ ఎన్నారై నేతలకు సూచించారు.
క్షేమంగా శివ.. త్వరలోనే స్వదేశానికి..
15
Jul