APలో వర్షాల ప్రభావంతో విద్యుత్ ప్రమాదాలు, సరఫరాలో అంతరాయాలు లేకుండా చూడాలని మంత్రి గొట్టిపాటి రవి అధికారులను ఆదేశించారు. విద్యుత్ తీగలు, స్తంభాలు, ట్రాన్స్ ఫార్మర్లు పాడైతే వెంటనే సరిచేసేలా పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. విద్యుత్ ఉద్యోగులు సెలవులు తీసుకోకుండా సేవలు అందించాలని ఆదేశించారు. విద్యుత్ సమస్యలపై 8500001912కు వాట్సాప్ ద్వారా సమాచారం ఇవ్వొచ్చని, 1912 నంబర్‌కు ఫోన్ చేయవచ్చన్నారు.
భారీ వర్షాలు.. వారికి సెలవులు లేవు: మంత్రి
21
Jul