AP: జగన్కు ఓ అభిమాని ముద్దుపెట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని పరామర్శించేందుకు నర్సరావుపేట మీదుగా జగన్ 2 రోజుల క్రితం వినుకొండ వెళ్లారు. పేటలోని SRKT కాలనీ వద్ద అభిమానులను కలిసేందుకు కారును ఆపించారు. ఈ టైంలో ఓ అభిమాని ఆప్యాయంగా జగన్ బుగ్గపై ముద్దు పెట్టాడు. అభిమాని చర్యతో జగన్ ఓ దశలో పట్టుకోల్పోయి కింద పడబోయారు. సెక్యూరిటీ అప్రమత్తమై ఆయన్ను పట్టుకున్నారు.
YS జగన్కు ముద్దుపెట్టిన అభిమాని
22
Jul