కర్ణాటకలోని ఉడుపి జిల్లాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. అబ్దుల్ ఖాదిర్ అనే వ్యక్తి ఓ కుక్కను తన వాహనం వెనుక కట్టి 6 కి.మీ మేర ఈడ్చుకెళ్లాడు. దీంతో తీవ్ర గాయాలతో కుక్క చనిపోయింది. ఆ వీడియో వైరల్ కావడంతో ప్రాణిదయ సంఘం సభ్యురాలు మంజుల కర్కేరా పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు అమానవీయ చర్యకు పాల్పడటమే కాక హెల్మెట్ లేకుండా బండి నడిపారని పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
దారుణం: కుక్కను బండికి కట్టి ఈడ్చుకెళ్లాడు
23
Jul