TG: చెట్టుకు వేలాడుతున్న మృతదేహాన్ని కిందకు దించబోయి ఓ వ్యక్తి తీవ్రగాయాలపాలయ్యాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా మునగాల మండలం ముకుందాపురంలో జరిగింది. గ్రామానికి చెందిన దేశగాని వెంకటేశం (80) తాటిచెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ మృతదేహాన్ని కిందకు దింపేందుకు ఓ వ్యక్తి ప్రయత్నిస్తుండగా తాడు జారి మృతుడు మరో వ్యక్తిపై పడటంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. అతడికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
విషాదం వెంట ఊహించని ప్రమాదం
03
Aug