బేల మండల కేంద్రంలో జాతీయ క్రీడా దినోత్సవంను గురువారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా స్థానిక మహాత్మ జ్యోతిబాపూలే రెసిడెన్షియల్ పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గురుకుల పాఠశాల విద్యార్థులు హ్యాపీ స్పోర్ట్స్ డే తెలియజేస్తూ అద్భుత విన్యాసం చేశారు. అనంతరం స్పోర్ట్స్ డే ప్రాముఖ్యతను విద్యార్థులకు తెలిపారు. ప్రిన్సిపాల్ రంగన్న, వైస్ ప్రిన్సిపల్ హరి కృష్ణ, సిబ్బంది ఉన్నారు.
బేల: స్పోర్ట్స్ డే సందర్భంగా విద్యార్థులు అద్భుత ప్రదర్శన
30
Aug