విజయవాడ ఇంద్రకీలాద్రిపై జలపాతం

AP: విజయవాడలో కనకదుర్గమ్మ కొలువైయున్న ఇంద్రకీలాద్రిపై అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. కుండపోత వర్షానికి ఓ జలపాతం ఏర్పడింది. కొండపై నుంచి నీరు కిందకు జాలువారుతూ దుర్గగుడికి కొత్త శోభను తీసుకొచ్చింది. నిజమైన జలపాతానికి ఏ మాత్రం తీసిపోని విధంగా ఉన్న ఈ సుందర దృశ్యాన్ని చూసేందుకు స్థానికులు తరలివస్తున్నారు. ఇంద్రకీలాద్రి వరదనీరు ఇలా జలపాతంలా రావడం తొలిసారి చూస్తున్నామని ఆలయ సిబ్బంది పేర్కొంటున్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *