AP: బుడమేరు వద్ద పూడ్చిన గండ్ల దగ్గర గట్టును మరింత పెంచుతున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. సీపేజ్ లీకేజ్ 500 క్యూసెక్కుల నుంచి 200 క్యూసెక్కులకు తగ్గేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందుకోసం జియో మెంబ్రేన్ షీట్ ఉపయోగిస్తున్నామని, గండ్ల మధ్య నల్లరేగడి మట్టితో గట్టును బలోపేతం చేస్తున్నామని చెప్పారు. భవిష్యత్తులో వరద పెరిగినా, పట్టిసీమకు నీరు తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు.
గట్టు ఎత్తు పెంచేలా, సీపేజ్ లేకుండా చర్యలు: మంత్రి
09
Sep