AP: విజయవాడలో వరదలు మిగిల్చిన కష్టాలు ఇంకా పలు ప్రాంతాలను వెంటాడుతున్నాయి. ముఖ్యంగా సింగ్ నగర్, వాంబే కాలనీ, సుందరయ్య నగర్, రాధానగర్, కండ్రిగ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇంట్లోని వంట సామాన్లు, గ్యాస్ స్టవ్లు పాడైపోవడంతో పది రోజులుగా పొయ్యి వెలిగించలేని స్థితిలో ప్రజలు ఉన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న ఆహారం కోసం బాధితులు ఎగబడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.
తీరని బాధలు.. ఆహారం కోసం ఎగబడ్డ జనం
13
Sep