ఆత్మహత్య చేసుకోవడానికి SI రైలు పట్టాల మీద కూర్చున్న ఘటన ఉత్తరప్రదేశ్లోని అలీఘడ్లో జరిగింది. కోర్టులో తనపై మేజిస్ట్రేట్ దురుసుగా వ్యవహరించారని SI ఆవేదన చెందారు. బైక్ దొంగతనం కేసులో అరెస్ట్ చేసిన ఐదుగురుని రిమాండ్ కోసం SI కోర్టులో హాజరుపర్చారు. అయితే నకిలీ వ్యక్తులను అరెస్ట్ చేశానని జడ్జి తనను అసభ్యంగా దూషించారని SI కన్నీరు పెట్టారు. సహచర పోలీసులు ఆయనను అక్కడి నుంచి తీసుకొచ్చి కేసు పెట్టించారు.
పట్టాలపై కూర్చుని ఆత్మహత్యకు యత్నించిన ఎస్సై
18
Sep