కథానాయకుడు రామ్చరణ్.. దర్శకుడు శంకర్ కలయికలో రూపొందిన చిత్రం ‘గేమ్ ఛేంజర్’. దిల్రాజు నిర్మాత. కియారా అడ్వాణీ కథానాయిక. ఎస్.జె. సూర్య, అంజలి, శ్రీకాంత్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.కథానాయకుడు రామ్చరణ్.. దర్శకుడు శంకర్ కలయికలో రూపొందిన చిత్రం ‘గేమ్ ఛేంజర్’. దిల్రాజు నిర్మాత. కియారా అడ్వాణీ కథానాయిక. ఎస్. జె. సూర్య, అంజలి, శ్రీకాంత్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా క్రిస్మస్ సందర్భంగా తెరపైకి రానున్నట్లు ఇది వరకే చెప్పినప్పటికీ విడుదల తేదీపై స్పష్టత ఇవ్వలేదు. ఇప్పుడీ అంశంపై సంగీత దర్శకుడు తమన్ క్లారిటీ ఇచ్చేశారు. ఈ చిత్రం డిసెంబరు 20నే థియేటర్లలోకి రానున్నట్లు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. వచ్చే వారం ఈ చిత్ర రెండో గీతం విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఇక అక్కడి నుంచి సినిమా విడుదలయ్యే వరకు నిరంతరాయంగా వరుస అప్డే పంచుకోనున్నారు. ఇక అక్టోబరు 1 నుంచి ఈ చిత్ర రీరికార్డింగ్ పనులు మొదలు కానున్నాయి. రాజకీయ అంశాలతో ముడిపడి ఉన్న యాక్షన్ థ్రిల్లర్గా ఈ చిత్రం రూపొందింది. ఇందులో చరణ్ రెండు కోణాలున్న పాత్రలో కనువిందు చేయనున్నారు. ఈ సినిమాకి సంగీతం: తమన్, ఛాయాగ్రహణం: తిరు.
రామ్ చరణ్ కొత్త కబుర్లు వినిపించాయి
21
Sep