దుర్గామాతపై భక్తిని చాటుకునేందుకు ఓ వ్యక్తి అవాంఛిత చర్యకు పూనుకున్నాడు. మధ్య ప్రదేశ్లోని బింద్ జిల్లా లాహర్ నగర్లో రతనఢ్ దేవీ ఉత్సవాల్లో రామ్ శరణ్ పాల్గొన్నాడు. అనంతరం తన నాలుకను తెగ్గోసుకుని అమ్మవారికి సమర్పించి, రక్తాన్ని అక్కడి పాత్రలో పోశాడు. ఇది చూసిన స్థానికులంతా నివ్వెరపోయారు. ఈ ఘటన తర్వాత రామ్ కాసేపు ఆలయంలోనే నిద్రించి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. – ఎవ్వరూ ఇలాంటి చర్యలకు పాల్పడవద్దు.
నాలుక కోసుకుని దుర్గామాతకు సమర్పించిన భక్తుడు!
10
Oct