AP: వచ్చే నెలలో ఎర్ర చందనం వేలం వేస్తామని dy.CM పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆసక్తి ఉన్నవారు వేలంలో పాల్గొనవచ్చని చెప్పారు. గుంటూరులో పవన్ మీడియాతో మాట్లాడారు. ‘స్మగ్లర్ల బారి నుంచి అడవులను రక్షిస్తాం. ఈ విషయంలో అటవీ అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తాం. అటవీ శాఖకు నా సంపూర్ణ మద్దతు ఉంటుంది. అలాగే రాష్ట్రంలో మహిళల సంరక్షణే మా మొదటి బాధ్యత. విద్యార్థినులకు మార్షల్ ఆర్ట్స్ నేర్పుతాం’ అని ఆయన పేర్కొన్నారు.
వచ్చే నెలలో ఎర్రచందనం వేలం: పవన్ కళ్యాణ్
11
Nov