ఏఆర్.రెహమాన్ తనకు తండ్రి లాంటి వారని బాసిస్ట్ మోహిని తెలిపారు. ‘గత 8.5 ఏళ్లుగా ఆయనతో పనిచేస్తున్నా. ఆయనంటే నాకెంతో గౌరవం. ఆయనకు నా వయసున్న కూతురు కూడా ఉంది. దయచేసి మా ప్రైవసీకి గౌరవం ఇవ్వండి’ అంటూ ఓ వీడియో రిలీజ్ చేశారు. రెహమాన్ దంపతులు విడాకులు తీసుకున్న కొన్ని గంటల్లోనే మోహిని కూడా తన భర్త నుంచి విడిపోతున్నట్లు ప్రకటించారు. దీంతో వారి మధ్య సంబంధం ఉండొచ్చని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.
రెహమాన్ నాకు తండ్రి లాంటి వారు: మోహిని
26
Nov