ఓ అటవీ ఉద్యోగి 20 అడుగుల మొసలిని తన భుజాల మీద మోసుకెళ్తున్న వీడియో ఇంటర్నెట్ని షేక్ చేస్తోంది. యూపీలోని హమీర్పూర్ జిల్లా పౌతియాఖుర్ద్ గ్రామ చెరువులో కొన్ని రోజుల క్రితం మొసలి దర్శనమిచ్చింది. సమాచారం అందుకున్న అటవీ అధికారులు స్థానికుల సాయంతో కొన్ని రోజులు శ్రమించి దాన్ని పట్టుకున్నారు. అనంతరం మొసలిని యమునా నదికి తరలించే క్రమంలో సిబ్బంది ఒకరు దాన్ని ఇలా భుజాల మీద మోసుకెళ్లారు.
20 అడుగుల మొసలిని భుజాల మీద మోసుకెళ్లాడు
27
Nov