ఏటూరు నాగారం ఎన్కౌంటర్లో హతమైన మావోయిస్టుల మృతదేహాలను రేపటి వరకు భద్రపరచాలని, మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు చూపించాలని హైకోర్టు ఆదేశించింది. ఇది బూటకపు ఎన్కౌంటర్ అని దాఖలైన పిటిషన్పై విచారణ జరిపింది. భోజనంలో మత్తు కలిపి, చిత్రహింసలకు గురిచేసి మావోలను చంపారని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. మృతదేహాలపై గాయాలున్నాయన్నారు. వాదనల అనంతరం విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది.
మావోల ఎన్కౌంటర్.. మృతదేహాలను భద్రపరచాలని కోర్టు ఆదేశం
06
Dec