AP: అనారోగ్యంతో భర్త మంచానికే పరిమితమయ్యాడు. తన ముగ్గురు పిల్లలతో పాటు మరో ముగ్గురు చెల్లెళ్ల పోషణ భారం ఆమెపైనే పడింది. అయినా ఆ ఇల్లాలు కుమిలిపోలేదు. కష్టాన్నే నమ్ముకుని ఆటో డ్రైవర్గా మారింది. ఆమే కడప జిల్లా కొండాపురం మండలం గండ్లూరుకు చెందిన గంగమ్మ. తన బాధలను ఆమె Way2Newsతో పంచుకొని వాపోయారు. సంపాదనంతా ఆటో అద్దెకే సరిపోతోందని, ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని కోరుతున్నారు.
గంగమ్మా.. నీకు వందనాలమ్మా!
19
Dec