ప్రభాస్ పేరిట ఉన్న దేశంలోనే అతిపెద్ద కటౌట్(230 అడుగులు) రికార్డు బ్రేక్ కానుంది. గేమ్ ఛేంజర్లో రామ్ చరణ్ లుక్తో 256 అడుగుల కటౌట్ను మెగాఫ్యాన్స్ విజయవాడలో ఏర్పాటు చేశారు. లుంగీ, బనియన్తో ఉన్న ఈ కటౌట్కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. ఇవాళ సాయంత్రం నిర్మాత దిల్ రాజు దీనిని ఆవిష్కరించనున్నారు. ఈ క్రమంలో గ్లోబల్ స్టార్ అంటే ఆ మాత్రం ఉంటుందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
256 అడుగుల రామ్ చరణ్ కటౌట్ చూశారా
30
Dec