రాజస్థాన్లో బోరుబావిలో పడిన చిన్నారి తల్లి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నా కూతురు అందులో పడి 6 రోజులైంది. ఆకలి, దాహంతో ఎంత వేదన అనుభవిస్తుందో? కలెక్టర్ పిల్లలైతే ఇలాగే వదిలేసేవారా?’ అని ఏడుస్తూ ప్రశ్నించారు. తన కూతురిని త్వరగా బయటికి తీసుకురావాలని వేడుకున్నారు. ఈనెల 23న చిన్నారి పొలం వద్ద ఆడుకుంటూ బోరుబావిలో పడింది. ఆమెను క్షేమంగా తీసుకొచ్చేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
కలెక్టర్ పిల్లలైతే ఇలాగే ఊరుకుంటారా?: తల్లి
30
Dec