బాసర గోదావరి నదిలోకి దూకిన ఓ మహిళను అక్కడే ఉన్న గంగపుత్రులు కాపాడారు. స్థానికుల వివరాల ప్రకారం.. బుధవారం నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ వివాహిత ఇంటి నుంచి బయలుదేరి గోదావరి పుష్కర ఘాట్ వద్ద నదిలో దూకింది. అక్కడే ఉన్న గంగపుత్రులు సురేశ్, ఓడ్డెన్న, రాజు, కృష్ణ, నరేశ్ ఆత్మహత్యకు ప్రయత్నించిన ఆమెను కాపాడి పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు.
గోదావరిలో దూకిన మహిళ.. కాపాడిన గంగపుత్రులు
10
Jan