లాస్ఏంజెలిస్ కార్చిచ్చుకు న్యూఇయర్ వేడుకల్లో కాల్చిన బాణసంచాయే కారణమయ్యుండొచ్చని వాషింగ్టన్ పోస్టు అంచనా వేసింది. కొందరు ప్రత్యక్ష సాక్షులు ఇదే చెబుతున్నారంటూ వార్తను ప్రచురించింది. బాణసంచా అవశేషాల నుంచే మళ్లీ మంటలు రాజుకున్నట్టు విశ్లేషించింది. 10 రోజుల తర్వాత భీకర గాలులు వీచేవరకు నిప్పు లోలోపలే రగిలి ఉండొచ్చన్న నిపుణుల అంచనాలతో ఇది సరిపోలుతోందంది. అసలు కారణమేంటో GOVT వెల్లడించాల్సి ఉంది.
న్యూ ఇయర్ బాణసంచా వల్లే..: వాషింగ్టన్ పోస్ట్
15
Jan