తిరుమల కొండపైకి కాలినడకన వెళ్లేందుకు ఇబ్బంది పడుతోన్న కొందరు యువకులను 72ఏళ్ల వృద్ధురాలు ఆశ్చర్యపరిచింది. ఏడాది క్రితం కాలు ఫ్రాక్చర్ అయినప్పటికీ దృఢ సంకల్పంతో కర్ర పట్టుకుని ఆగకుండా వేగంగా నడిచింది. ‘ఆ పైవాడే నన్ను నడిపిస్తున్నాడు’ అని చెప్తూ ఆమె ముందుకెళ్లగా, ఈ వీడియో SMలో వైరలవుతోంది. ఇలాంటి వారికి ప్రత్యేక దర్శనం కల్పిస్తే బాగుంటుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. దీనిపై మీ కామెంట్?
72 ఏళ్ల వయసులోనూ మెట్లమార్గంపై!
06
Apr