తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీపై జస్టిస్ బ్రిజేష్ కుమార్ నేతృత్వంలోని కృష్ణా ట్రైబ్యునల్-2 ఈ నెల 15 నుంచి మరోసారి విచారణ జరపనుంది. 3 రోజుల పాటు జరిగే విచారణలో TG తరఫున ఇప్పటికే 2 దఫాలు వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ మరో 2 లేదా 3 సార్లు వాదించనున్నారు. ఆ తర్వాత AP తరఫున వాదనలు ప్రారంభం అవుతాయి. ఈ ట్రైబ్యునల్ విచారణకు తెలంగాణ మంత్రి ఉత్తమకుమార్ రెడ్డి హాజరు కానున్నారు.
కృష్ణా జలాల పంపిణీపై 15 నుంచి విచారణ
15
Apr