తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టలో భద్రతాబలగాలు భారీ సొరంగాన్ని గుర్తించాయి.
వెయ్యి మంది తలదాచుకునేలా పెద్ద మైదానమే ఉన్నట్లు పేర్కొన్నాయి. సొరంగంలో నీటి వసతి, ఇతర సౌకర్యాలను కూడా మావోయిస్టులు ఏర్పరచుకున్నట్లు వెల్లడించాయి. ఎన్కౌంటర్ల నేపథ్యంలో కొన్ని నెలలపాటు నక్సల్స్ ఇందులోనే తలదాచుకున్నట్లు అనుమానిస్తున్నాయి. అటు కర్రెగుట్టను భద్రతాబలగాలు చుట్టుముట్టి కూంబింగ్ నిర్వహిస్తున్నాయి