TG: హైదరాబాద్ రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. అబ్రిజ్ అపార్ట్మెంట్లో ఉంటున్న భార్యభర్తలు షేక్ అబ్దుల్లా (70), రిజ్వానా (65)ను దుండగులు కత్తులతో నరికి దారుణంగా హత్య చేశారు. హత్యకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, సీసీటీవీ ఫుటేజీలను చెక్ చేస్తున్నారు. ఈ ఘటనతో అపార్ట్మెంట్ వాసులు తీవ్ర భయందోళనలకు గురవుతున్నారు.
దంపతులను కత్తులతో నరికి చంపిన దుండగులు
07
Jun