చిత్ర పరిశ్రమలో రాణించాలంటే నెపోకిడ్ అయినా కష్టపడాల్సిందేనని తెలుగు హీరో మంచు మనోజ్ తాజాగా తెలిపారు. మంగళవారం హైదరాబాద్లో జరిగిన ‘ఓ భామ అయ్యో రామ’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన ఈ కామెంట్స్ చేశారు. అలాగే హీరో సుహాస్ ప్రతిభావంతుడంటూ ప్రశంసలు కురిపించారు.
ఇక ఇటీవల మనోజ్ భైరవం సినిమాతో హిట్ అందుకున్నారు. ప్రస్తుతం మిరాయ్ సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నారు.