AP: శ్రీశైల జలాశయం నుంచి దిగువకు నీటి విడుదల కొనసాగుతోంది. 3 గేట్ల ద్వారా 81,195 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతం నుంచి వరద పెరగడంతో ఈ రాత్రి 11 గంటల తర్వాత ఏ సమయంలోనైనా మరో గేటును ఎత్తే అవకాశం ఉంది. త్రివర్ణ పతాక రంగుల విద్యుత్ వెలుగుల నడుమ కృష్ణమ్మ పరవళ్లను తిలకించేందుకు సందర్శకులు ఆసక్తి చూపుతున్నారు. రెండ్రోజుల కిందట సీఎం చంద్రబాబు డ్యామ్ గేట్లను ఎత్తిన విషయం తెలిసిందే.
శ్రీశైలం: విద్యుత్ వెలుగుల్లో కృష్ణమ్మ పరవళ్లు
11
Jul