AP: ఉపరాష్ట్రపతి ఎన్నికలో NDA అభ్యర్థికి TDP, జనసేన, YCP మద్దతుపై ఏపీసీసీ చీఫ్ షర్మిల ఫైరయ్యారు. ‘తెలుగు జాతికి నేడు చీకటి రోజు. తెలుగు బిడ్డ (సుదర్శన్ రెడ్డి) పోటీ పడితే, RSS వాదికి ఓటు వేయించిన 3 పార్టీల అధ్యక్షులు చరిత్రహీనులు. మత పిచ్చి మోదీకి మోకాళ్లు ఒత్తడమే వారి లక్ష్యం. BJPకి ఓటు వేసినందుకు YCP సిగ్గుపడాలి. కేసులకు భయపడి మోదీకి జగన్ దత్తపుత్రుడిగా అవతారం ఎత్తారు’ అని ట్వీట్ చేశారు.
తెలుగు జాతికి నేడు చీకటి రోజు: షర్మిల
09
Sep