రాహుల్ గాంధీ ‘హిందూ’ వ్యాఖ్యలపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఫైర్ అయ్యారు. ‘లోక్సభలో ప్రతిపక్ష నేత అయ్యాక రాహుల్ మెచ్యూర్గా మాట్లాడతారని అనుకున్నాం. కానీ ఆయన వ్యాఖ్యలు అలా లేవు. పూర్తిగా మెచ్యూరిటీ లేని వ్యక్తిగా మాట్లాడుతున్నారు. హిందూ అనేది మన దేశ ఆత్మ’ అని యోగి అన్నారు. హిందువుల మనోభావాలు కించపరిచిన రాహుల్ క్షమాపణ చెప్పాలని MH డిప్యూటీ CM ఫడ్నవీస్ డిమాండ్ చేశారు
రాహుల్ మెచ్యూరిటీ లేకుండా మాట్లాడుతున్నారు: యోగి
01
Jul