AP: మంత్రి రాంప్రసాద్ రెడ్డి సతీమణి ఓ పోలీస్ ఆఫీసర్పై ఆగ్రహం వ్యక్తం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘తెల్లవారిందా? ప్రభుత్వమే కదా జీతం చెల్లిస్తోంది. YCP వాళ్లేమైనా ఇస్తున్నారా? మీకోసం అర్ధగంట నుంచి వెయిట్ చేస్తున్నాం. కాన్వాయ్ స్టార్ట్ చేయండి’ అంటూ ఆమె అసహనం వ్యక్తం చేశారు. ‘మంత్రి గారి భార్య రాయచోటిలో పోలీసుల్ని బానిసల్లా చూస్తూ వార్నింగ్ ఇచ్చారు’ అని దీనిపై YCP ట్వీట్ చేసింది.
పోలీసుపై మంత్రి భార్య ఆగ్రహం.. వీడియో వైరల్
01
Jul