TG: PCC అధ్యక్షుడి నియామకం తాత్కాలికంగా వాయిదా పడినట్లు తెలుస్తోంది. రాష్ట్ర నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో అధిష్ఠానం వాయిదా వేసినట్లు సమాచారం. వారం రోజుల్లో మరోసారి చర్చించి దీనిపై నిర్ణయం తీసుకోనున్నట్లు టాక్. కాగా PCC చీఫ్ పదవి కోసం BC వర్గానికి చెందిన మధుయాష్కీ గౌడ్, మహేశ్ కుమార్ గౌడ్ పోటీ పడుతున్నారు. కానీ మహేశ్ కుమార్ గౌడ్ వైపే అధిష్ఠానం మొగ్గుచూపుతున్నట్లు గాంధీభవన్ వర్గాల సమాచారం.
PCC అధ్యక్షుడి నియామకం వాయిదా?
03
Jul