సారంగాపూర్ మండలంలోని సుప్రసిద్ధ అడెల్లి శ్రీ మహపోచమ్మ ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. కళాశాలలు, పాఠశాలకు సెలవులు రావడంతో జిల్లా నుంచే కాకుండా ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మహారాష్ట్ర నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మ వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది. అనంతరం భక్తులు ఖుషి పండుగలు నిర్వహించారు.
సారంగాపూర్: అడెల్లి పోచమ్మ ఆలయంలో భక్తుల సందడి
08
Jul