AP: మందుబాబులకు ఓ ప్రభుత్వ టీచర్ చేసిన విజ్ఞప్తి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మద్యం తాగిన తర్వాత సీసాలు పగులగొట్టవద్దని విజయనగరం(D) తెర్లాం (మ) నందబలగ ZPHS టీచర్ మోహన్ రావు ఊళ్లో దండోరా వేశారు. సీసాలు పగులగొట్టడం వల్ల గాజు పెంకులు గుచ్చుకుని పిల్లలు, రైతులతో పాటు మూగజీవాలు ఇబ్బందులు పడుతున్నట్లు అవగాహన కల్పించారు. సీసాలు అలానే వదిలేస్తే అమ్ముకుని జీవించేవారు చాలామంది బాగుపడతారని చెప్పారు.
మద్యం తాగి, సీసాలు పగుల కొట్టొద్దు.. టీచర్
11
Jul