AP: పదో తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలో తప్పులు దొర్లడంపై పాఠశాల విద్యాశాఖ వివరణ ఇచ్చింది. సీడీల్లో మార్పు వల్లే ఈ తప్పు జరిగినట్లు తెలిపింది. పదో తరగతిలో కొత్త సిలబస్ ప్రవేశ పెట్టామని.. అయితే సీడీల్లో మార్పు వల్ల ఉమ్మడి ప.గో, తూ.గో, కృష్ణా జిల్లాలకు సరఫరా చేసిన పుస్తకాల్లో కొన్ని తప్పులు దొర్లాయంది. తప్పులున్న పేజీల స్థానంలో విద్యార్థులకు వారం రోజుల్లో అనుబంధ బుక్లెట్లు అందిస్తామని తెలిపింది.
టెన్త్ తెలుగు పుస్తకంలో తప్పులు.. వారం రోజుల్లో కొత్త బుక్లెట్స్
13
Jul