AP: నంద్యాలలోని డామినోస్ పిజ్జా సెంటర్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. తాను చికెన్ పిజ్జా ఆర్డర్ ఇవ్వగా కుళ్లిన చికెన్ ముక్కలు వచ్చాయని, వాటిని తిన్న పిల్లలు వాంతులు చేసుకున్నారని ఓ వ్యక్తి ఆరోపించారు. పిజ్జా సెంటర్ సిబ్బందిని అడిగితే నిర్లక్ష్యపు సమాధానం ఇచ్చారని ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారులు తనిఖీలు చేపట్టి శాంపిల్స్ ల్యాబ్కు పంపించారు.
డామినోస్ పిజ్జాలో కుళ్లిన చికెన్ ముక్కలు.. తనిఖీలు
19
Jul