TG: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డకు వరద పోటెత్తడంతో మరోసారి ఆ బ్యారేజీ వార్తల్లోకెక్కింది. 3 లక్షల క్యూసెక్కులకు పైగా ప్రవాహం వచ్చినా మేడిగడ్డ తట్టుకుని నిలబడిందని BRS నేతలు పోస్టులు చేస్తున్నారు. మేడిగడ్డ కూలిపోతుందని కాంగ్రెస్ అసత్య ప్రచారం చేసిందని మండిపడుతున్నారు. అయితే గేట్లు మూసి ఆ ప్రవాహాన్ని ఆపితే బ్యారేజీ అసలు కథ బయటపడుతుందని కాంగ్రెస్ అభిమానులు, నెటిజన్లు కౌంటర్ ఇస్తున్నారు
మేడిగడ్డ నిలబడిందన్న BRS.. గేట్లు మూస్తే తెలుస్తుందంటున్న కాంగ్రెస్!
20
Jul