HATSOFF సోనూ.. కాలేజీకి దేవీకుమారి!
AP: సోనూ అంటే బంగారం అని అర్థం. ఆ పేరున్న సోనూ సూద్ నిజంగానే పేదలకు బంగారంలా మారారు. కాలేజీలో చేర్పిస్తానని బనవనూరుకు చెందిన దేవీకుమారికి ఆయన ఇటీవల మాట ఇచ్చారు. ఆ మాటను నిలబెట్టుకుంటూ తాజాగా అడ్మిషన్ ఇప్పించారు. తన ట్విటర్లో ఈ విషయాన్ని వెల్లడించారు. ‘మీ ఆప్యాయతకు థాంక్స్ దేవీ. బాగా చదువుకుని కుటుంబాన్ని గర్వపడేలా చేయండి. ఈ విషయంలో తోడ్పడిన AP CM చంద్రబాబుకు కృతజ్ఞతలు’ అని పేర్కొన్నారు.