TG: రంగారెడ్డి (D) మహేశ్వరంలో ఓ హోటల్లో జరిగిన దొంగతనం వీడియో వైరలవుతోంది. ఫేస్ మాస్కు, చేతిలో కర్రతో అర్ధరాత్రి హోటల్లోకి చొరబడిన దొంగ ఒక్క రూపాయీ దొరక్కపోవడంతో తీవ్ర నిరాశ చెందాడు. కిచెన్లోనూ ఏం దొరక్కపోవడంతో కెమెరా ముందు ఆవేదన వెళ్లగక్కాడు. ఒక్క రూపాయి కూడా పెట్టలేదు, మీకో దండం అని కెమెరా ముందు వాపోయాడు. చివరికి ఫ్రిడ్జిలోని వాటర్ బాటిల్ తీసుకొని రూ.20 నోటును టేబుల్పై ఉంచి వెళ్లిపోయాడు.
చోరీకి వెళ్లిన దొంగ ఆవేదన చూడండి
26
Jul