కుమారుడిపై తండ్రి కత్తితో దాడి చేసిన ఘటన మంచిర్యాల జిల్లాలోని నెన్నెల మండలం పోచమ్మవాడలో జరిగింది. గ్రామానికి చెందిన శేఖర్ పై గురువారం రాత్రి అతడి తండ్రి విజయ్ మద్యం మత్తులో కత్తితో దాడిచేసి తీవ్రంగా గాయపరిచినట్లు స్థానికులు తెలిపారు. దీంతో శేఖర్ ఛాతి, చేతిపై తీవ్రగాయాలు కాగా వెంటనే అతడిని బెల్లంపల్లి ఆసుపత్రికి తరలించారు. కాగా అతడి తండ్రి పరారీలో ఉన్నట్లు శేఖర్ వెల్లడించాడు.
నెన్నెల: కుమారుడిపై కత్తితో దాడిచేసిన తండ్రి
26
Jul